దర్శకుడు క్రాంతి మాధవ్ విజయ్ దేవరకొండ హీరోగా ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామా గా తెరకెక్కిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. ప్రేమికుల రోజున విడుదలైన ఈ సినిమా తొలిరోజు భారీ వసూళ్లు రాబట్టిందనే చెప్పాలి. ప్రచారం అదిరిపోవడంతో టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు కలెక్షన్లు అదిరిపోయాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.6.5 కోట్లు రాబట్టినట్లు సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమా కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఫస్ట్‌డే రూ.8 కోట్లు రాబట్టినట్లు సమాచారం. కాగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ.23.81 కోట్లకు అమ్ముడుపోయాయి. చూడాలి మరీ ఈ సినిమా ముందు ముందు ఈ మిక్స్‌డ్ టాక్ నుండి బయటపడి పుంజుకుంటుందా.. లేదా నష్టాలను మూటగట్టుకోనుందా.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’కు గోపి సుందర్ సంగీతం సమకూర్చాడు. కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ నిర్మించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa