ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బన్నీ ‘అల వైకుంఠపురములో’ వైజాగ్ లో భారీ రికార్డ్!

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 16, 2020, 12:21 PM

డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురములో’.   భారీ అంచనాల నడుమ విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాలలో పాటు, యూఎస్ లో ఈ చిత్రం విశేష ఆదరణ దక్కించుకుంటుంది.  వసూళ్ల పరంగా బన్నీ కెరీర్లో కొత్త రికార్డుల్ని క్రియేట్ చేసింది ఈ చిత్రం. ఇక విడుదలైన నాటి నుండి వైజాగ్ సిటీలో ఇతర అన్ని సినిమాలను డామినేట్ చేస్తూ వచ్చిన ఈ చిత్రం వైజాగ్ లోని రెండు సింగిల్ స్క్రీన్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్స్ ను రాబట్టింది. కాగా వైజాగ్ లోని మెలోడీ థియేటర్ లో మొత్తం 28 రోజులకు గానూ రూ. 1,00,98,121 / – అలాగే శరత్ థియేటర్ లో మొత్తం 35 రోజులకు గానూ రూ. 1,00,18,228 / – కలెక్షన్స్ తో భారీ రికార్డ్ నమోదు చేసింది. ఇప్పటివరకూ దాదాపు ఈ రేంజ్ కలెక్షన్స్ వైజాగ్ లో ఏ హీరో సినిమా రాబట్టలేదు. బన్నీ చిత్రం ఈ రికార్డ్ సాధించడం విశేషమనే అనాలి. ఇకపోతే బన్నీ తన తర్వాతి చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై బన్నీ అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకులందరిలో భారీ అంచనాలున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa