ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నైజాంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ లేటెస్ట్ కలెక్షన్స్ !

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 16, 2020, 12:14 PM

దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కించిన ఎమోషన్ అండ్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ వరల్డ్ ఫేమస్ లవర్. ప్రేమికుల రోజు కానుకగా ఈ సినిమా 14వ తేదీన విడుదలైంది. కాగా సినిమాలో ప్రధాన నటీనటుల నటనకు ప్రశంసనీయమైన అభినందనలు వచ్చిన్నప్పటికీ, ఈ చిత్రానికి విమర్శకులు, సినీ ప్రేమికుల నుండి మాత్రం మిశ్రమ స్పందన మాత్రమే లభిచింది. అయితే విజయ్ దేవరకొండ క్రేజీతో ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్‌ నమోదు అయ్యాయి. ఈ చిత్రం నైజాంలో మొదటి రోజు రూ .2.02 కోట్లను అలాగే శనివారం నాడు రూ .84.36 లక్షలను వసూళ్లు చేసింది. ఇక ఎలాగూ ఈ రోజు సండే కాబట్టి వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. కాగా రేపటి నుండి ఉండబోయే వసూళ్ళతో సినిమా ఫలితమేమిటన్నది తేలిపోతుంది. క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ నిర్మించగా ఇందులో రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథరిన్ థ్రెస, ఇసబెల్లా కథానాయికలుగా నటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa