మెగాస్టార్ చిరంజీవి మొదటి సినిమా దర్శకుడు రాజ్ కుమార్ మృతి చెందిన దురదృష్ట సంఘటన తెలిసిందే. కాగా రాజ్ కుమార్ మృతి తీరని లోటని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్ కుమార్ నన్ను కలసి తన దర్శకత్వంలో వస్తున్న”పునాది రాళ్లు”సినిమాలో వేషం వెయ్యమని అడిగారు. అప్పుడు నేను ఇనిస్టిట్యూట్లో శిక్షణ తీసుకుంటున్నాను పూర్తి కాకుండా ఎలాఅన్నా కూడా బలవంతంగా నువ్వే చేయాలి అని నాతో చేయించడం జరిగింది. అలా ‘పునాది రాళ్లు’ సినిమా షూటింగ్లో పాల్గొన్నాను. నా నట జీవితానికి అదే “పునాది రాళ్లు” వేసింది. మెగాస్టార్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఈ మధ్యనే మా ఇంటికి వచ్చి కలిశారు, అనారోగ్యంతో ఉన్నానని చెప్పడంతో అపోలో ఆస్పత్రికి పంపించి వైద్య పరీక్షలు కూడా చేయించడం జరిగింది ఆయన పూర్తి ఆరోగ్యంతో మళ్లీ నా దగ్గరకు వస్తారు అనుకున్నాను ఇంతలో ఇలా జరగటం చాలా బాధాకరం. రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa