ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అర్జున్ రెడ్డి' నుండి విజయ్ బయటకు రాకపోతే కష్టమేనా?

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 15, 2020, 07:42 PM

'వరల్డ్ ఫెమస్ లవర్' సినిమాలో విజయ్ దేవరకొండ నటనలో, స్టైలింగ్ లో అక్కడక్కడా అర్జున్ రెడ్డి ఛాయలు కనబడ్డాయి. ప్రేక్షకులు, క్రిటిక్స్ కూడా అదే చెబుతున్నారు. అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ నుండి విజయ్ ఎప్పటికి బయటపడతాడో అని అంటున్నారు. 'వరల్డ్ ఫెమస్ లవర్' ని క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేశాడా..? లేదంటే విజయ్ డైరెక్ట్ చేశాడా? అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా స్టయిల్ ఆఫ్ డైరక్షన్ అంతా విజయ్ దే అని అనిపించకమానదు. ఈ సినిమాలో దర్శకుడు కథపై ఫోకస్ చేసినా కథనంపై మాత్రం అంతగా దృష్టి పెట్టలేకపోయాడు. అందుకే 'వరల్డ్ ఫెమస్ లవర్' కథ బాగున్నా కూడా స్క్రీన్ ప్లే మాత్రం స్లోగా సాగింది. ఎంత వద్దనుకున్నా కూడా ఇప్పటికీ అర్జున్ రెడ్డి ప్రభావం విజయ్ దేవరకొండపై కనిపిస్తూనే ఉంది. విజయ్ దేవరకొండ తో సినిమా అనగానే దర్శకులు కూడా అర్జున్ రెడ్డికి కనెక్ట్ అయ్యి... అలాంటి కథలనే రాస్తుండడంతో బెడిసి కొడుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa