ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనసూయ 10 ఏళ్ల లవ్ స్టోరీ మీకు తెలుసా?

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 17, 2020, 10:50 AM

బుల్లి తెర హాట్ యాంకర్ గా ప్రస్తుతం తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న అనసూయ లవ్ స్టోరీలో సినిమా కథకు సరిపోయే అనేక ట్విస్టులు ఉన్నాయి. అనసూయది ప్రేమ వివాహం అన్నది అందరికీ తెలిసిన విషయమే అయినా వీరి ప్రేమ పదేళ్లు సాగింది అన్న విషయం తెలిస్తే ఎవరైనా షాక్ అవుతారు. ఇప్పటికే అనసూయ పెళ్ళి జరిగి దశాబ్ద కాలం అవుతున్న పరిస్థితులలో అనసూయ భరద్వాజ్ ల ప్రేమ మొదలై రెండు దశాబ్దాలు అయిన సందర్భంలో అనసూయ తన ప్రేమ వ్యవహారంలోని అనేక ట్విస్ట్ లను లేటెస్ట్ గా బయట పెట్టింది. 


అనసూయ ఇంటర్ లో ఉండగానే భరద్వాజ్ తో ప్రేమలో పడిపోయిందట. కాలేజ్ ఎన్ సీసీ క్యాంప్ కు వెళ్లిన సమయంలో అనసూయకు భరద్వాజ్ పరిచయం అయ్యాడట. ఆ సమయంలో టీమ్ లీడర్ గా అనసూయ వ్యవహరిస్తూ ఉండటంతో ఆరోజులలోనే అనసూయ అందరి పై తన ఆదిపత్యాన్ని కొనసాగిస్తూ ఉండేదట. ఇక అనసూయను ప్రేమిస్తున్నట్లుగా క్యాంప్ సమయంలోనే భరద్వాజ్ ఆమెకు చెప్పాడట. 


 


ఆ సమయంలో మౌనంగా ఉన్న అనసూయ మరుసటి సంవత్సరం జరిగిన క్యాంప్ సమయంలో భరద్వాజ్ ప్రేమకు ఓకే చెప్పినా వారి ప్రేమ విషయం చాలా కాలం పాటు ఇంట్లో తెలియకుండా మేనేజ్ చేసారట. ఇలాంటి పరిస్థితులలో అనసూయకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో తాను ప్రేమించిన విషయాన్ని బయట పెట్టడంతో ఇంట్లో పెద్ద గొడవలు జరిగిన విషయాన్ని గుర్తుకు చేసుకుంది. అనసూయ తండ్రికి భరద్వాజ్ నచ్చకపోవడంతో ఆమె కోపగించి ఇంట్లోంచి బయటకు వచ్చి హాస్టల్ లో ఉన్న అప్పటి విషయాలను బయటపెట్టింది. వాస్తవానికి అనసూయ తండ్రి ఇలా ప్రవర్తించడం వెనుక ఒక ఆసక్తికర కారణం ఉంది. అనసూయకు మంచి సంబంధంతో వివాహం చేస్తే ఆమె ఇద్దరు చెల్లెల్లకు కూడా మంచి సంబంధాలు వస్తాయనేది ఆమె తండ్రి అభిప్రాయం. అందుకే మొదట భరద్వాజాను వద్దన్నాడట. ఇప్పుడు అనసూయ తన ఇద్దరు చెల్లెల్లకు కూడా తానే స్వయంగా పెళ్ళిళ్ళు చేసి మంచిగా సెటిల్ చేసిందట. ఇలా తన కుటుంబ బాధ్యతలను అన్న మాట ప్రకారం తానే తీర్చాను అని చెపుతున్న అనసూయలో ఇంత బయటపడని హీరోఇజమ్ ఉందా అంటూ ఆ ఇంటర్వ్యూను చదివినవారు కామెంట్ చేసుకుంటున్నారు..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa