ప్రస్తుతం హీరో అజిత్ ‘వాలిమై’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో అజిత్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఇందులో ప్రతినాయకుడిగా తెలుగు యువ హీరో కార్తికేయ నటిస్తాడని గతంలో వార్తలు రాగా అవి వాస్తవం కాదని తమిళ సినీ వర్గాలు స్పష్టం చేశాయి. ఆ తర్వాత మరొక తెలుగు నటుడు నవదీప్ పేరు తెరపైకి వచ్చినా అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా ఇందులో విలన్ తెలుగు హీరో అని కన్ఫర్మ్ చేసినట్టు సమాచారం. అయితే ఆ హీరో కార్తికేయనా, నవదీపా, లేకపోతే వేరే ఎవరైనానా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇకపోతే ఇందులో అజిత్ సరసన హుమా ఖురేషి కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ 2020 వేసవికి విడుదలకానుంది. అజిత్ గత చిత్రం ‘నెర్కొండ పారవై’ను డైరెక్ట్ చేసిన హెచ్.వినోత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa