డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా మాస్ ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో బాలయ్య కొన్ని సీక్వెన్స్ లో అఘోరాగా కనిపించబోతున్నాడని ఆ న్యూస్ సారాంశం. ఆలాగే ఆధ్యాత్మికతతో మొదలై బాలయ్య పాత్ర కూడా చాల వైవిధ్యంగా అలాగే ప్రేరణాత్మకంగా ఉండబోతుందట, పైగా బాలయ్య అసలు అఘోరాగా ఎలా మారాడు ఆయన గతం ఏమిటి అనే కోణంలో కూడా ఓ పవర్ ఫుల్ ప్లాష్ బ్యాక్ కూడా వస్తోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే ఈ వార్తలో అసలు నిజం ఉందా అనేది అనుమానమే. బాలయ్య లాంటి మాస్ హీరోకి అఘోరా లాంటి పాత్ర ఎంతవరకు సూట్ అవుతుంది. ఒకవేళ బాలయ్య అలాంటి రోల్ లో నటిస్తే ఆయన అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారు లాంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తోన్న సినిమా షూటింగ్ ఈ నెల 26న నుండి జరగబోతుంది. నిజానికి గత నెలలోనే మొదలవ్వాల్సిన షూటింగ్ బోయపాటి ఇంట్లో జరిగిన విషాదం కారణంగా అనుకున్న డేట్ కి షూటింగ్ ప్రారంభించలేదు. ఈ చిత్రంలో శ్రీకాంత్ ప్రటినాయకుడి పాత్ర చేయనున్నారని సమాచారం. ఇకపోతే ఈ యేడాది వేసవికి సినిమా విడుదలకానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa