టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల తొలిసారి మనసుకు నచ్చింది అనే చిత్రంతో మెగా ఫోన్ పట్టుకున్న సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ ,అమైరా దస్తూర్, త్రిదా చౌదరి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆనంది ఇందిరా ప్రొడక్షన్ ఎల్ఎల్ పి బ్యానర్ లో కిరణ్, సంజయ్ స్వరూప్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్ర పోస్టర్, టీజర్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. రిపబ్లిక్ డే శుభాకాంక్షలతో జనవరి 26, 2018న చిత్రం విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ రోజు సాయంత్రం 4గం.లకు సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా చిత్ర ట్రైలర్ విడుదల చేయనున్నారు మూవీ మేకర్స్. ఈ చిత్రానికి రతన్ సంగీతం అందించగా, త్వరలోనే పాటలని విడుదల చేయనున్నారు. మంజుల కూతురు జాన్వీ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తుండగా, మనసుకు నచ్చింది చిత్రం జాన్వీ డెబ్యూ మూవీ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa