ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్టీఆర్ బయోపిక్‌లో కళ్యాణ్ రామ్ కొడుకు

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 09, 2018, 01:02 PM

సంక్రాంతి బరిలో జై సింహాగా సత్తా చాటేందుకు రెడీ అవుతున్న నందమూరి బాలకృష్ణ తరువాత ఎన్టీఆర్ బయోపిక్ లో నటించనున్న సంగతి తెలిసిందే. తేజ దర్శకత్వంలో బాలకృష్ణ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ గా బాలయ్యే నటిస్తున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.


ఎన్టీఆర్ జీవితాన్ని సమగ్రంగా చూపిస్తామని ఇటీవల బాలకృష్ణ ప్రకటించారు. సినిమాలో ఎన్టీఆర్ చిన్నతనానికి సంబంధించిన సన్నివేశాల్లో కళ్యాణ్ రామ్ తన నందమూరి శౌర్య రామ్ ఎన్టీఆర్ గా కనిపించనున్నాడట. ఈ విషయంపై అధికారిక ప్రకటన లేకపోయినా.. ఫిలిం నగర్ లో ఈ వార్త గట్టిగానే వినిపిస్తోంది. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఇజం సినిమాల్లో హీరో చిన్నప్పటి పాత్రలో నటించిన శౌర్య, చిన్నారి తారక రాముడిగా అభిమానులను అలరించనున్నాడట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa