ముంబయి: మోడళ్లు, కథానాయికలు రెడ్ కార్పెట్‌పై క్యాట్‌వాక్‌తో హోయలొలికిస్తుంటారు. అసలు క్యాట్ వాక్ చేయాలంటే వారి తరువాతే ఎవ్వరైనా. కానీ బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె తన స్టైల్‌లో ఓ కొత్తరకం క్యాట్ వాక్ కనిపెట్టినట్టుంది. ఆమె క్యాట్‌వాక్ చేసిన తీరు చూస్తే నవ్వకుండా ఉండలేరు. ‘బీఎఫ్‌ఎఫ్ వోగ్’ కార్యక్రమంలో దీపిక తన సోదరి అనీశా, నటి నేహా ధుపియాతో కలిసి పాల్గొంది. ఈ సందర్భంగా దీపిక ఫన్నీగా క్యాట్‌వాక్ చేసి చూపించింది. దీనికి అక్కడున్నవారంతా పగలబడి నవ్వారు. ఈ వీడియోని దీపిక ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
దీపిక టైటిల్ పాత్రలో నటించిన ‘పద్మావతి’ సినిమా ఎట్టకేలకు విడుదలకు నోచుకుంది. సినిమాలో కొన్ని మార్పులు చేసి ‘పద్మావత్’ టైటిల్‌తో ఈ సినిమాను జనవరి 25న విడుదల చేయనున్నారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ కథానాయకులుగా నటించారు. ఈ సినిమా తర్వాత దీపిక ‘సప్నా దీదీ’ బయోపిక్‌లో నటించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa