విశ్వక్ సేన్ హీరోగా దర్శకుడు డాక్టర్ శైలేష్ కొలను క్రైమ్ థ్రిల్లర్ గా ‘హిట్’ తెరకెక్కిస్తున్నారు. హీరో నాని నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో తెరకెక్కుతున్న రెండవ చిత్రం ‘హిట్’. ఇటీవలే ఈ చిత్ర టీజర్ విడుదల కాగా విశేష ఆదరణ దక్కించుకుంది. కాగా నేడు హిట్ మూవీ ట్రైలర్ విడుదలైంది. రెండు నిమిషాలకు పైగా ఉన్న ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ప్రీతీ అనే ఓ యువతి మిస్సింగ్ మరియు మర్డర్ మిస్టరీ చుట్టూ ఈ చిత్రం తిరుగుతుందని అర్థం అవుతుంది. ఈ మిస్సింగ్ కేసును ఛేదించే పోలీస్ అధికారి విక్రమ్ గా విశ్వక్ సేన్ కనిపిస్తున్నారు. డ్రగ్ మాఫియా నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది అనిపిస్తుంది. అలాగే హీరో విశ్వక్ ఒక మానసిక వ్యాధితో బాధపడే పోలీస్ గా కనిపిస్తుండగా నిఘాఢంగా…అతని పాత్రలో ఎదో సస్పెన్స్ దాగివుందనిపిస్తుంది. మొత్తంగా ట్రైలర్ సూపర్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో కేకగా ఉంది. హిట్ మూవీ ఈనెల 28న గ్రాండ్ గా విడుదల కానుంది. రుహని శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రశాంతి త్రిపురనేని నిర్మిస్తున్నారు.
WALL POSTER CINEMA
Proudly presents #HITTrailer https://t.co/OEIKcWUz4T
All you thriller fans ... this ones for you #HitOnFeb28th #HitMovie#VishwakSen @iRuhaniSharma @KolanuSailesh @svr4446 @Garrybh88 @maniDop @PrashantiTipirn #VivekSagar
— Nani (@NameisNani) February 19, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa