ట్రెండింగ్
Epaper    English    தமிழ்

133 కోట్లకు చేరుకున్న సరిలేరు నీకెవ్వరు సినిమా కలెక్షన్స్ ......

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2020, 05:13 PM

బాక్సాఫీస్ దగ్గర తన కలెక్షన్స్ తో రికార్డ్స్ మోత మోగిస్తున్న మహేష్ బాబు సినిమా. అనిల్ రావిపూడి దర్శత్వం లో వచ్చిన  "సరిలేరు నీకెవ్వరు"  విడుదలై అప్పుడే నెల రోజులు దాటేసింది. ఈ నెల రోజుల్లో 133 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇప్పటి వరకు మహేష్ నటించిన సినిమాల గత రికార్డులను పూర్తిగా తుడిచిపెట్టేసింది ఈ చిత్రం. విడుదలైన మూడు, నాలుగు వారాల్లో ఈ సినిమా అక్కడక్కడా సత్తా చూపించింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం 110 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ప్రకటించింది చిత్రయూనిట్. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం మాస్ ఆడియన్స్‌ను బాగానే ఆకట్టుకుంటుంది. గ్రాస్ విషయానికి వస్తే 210 కోట్లకు పైగా వసూలు చేసి సత్తా చూపించింది.

37 రోజులు పూర్తి కావడంతో అన్నిచోట్లా కూడా ఫైనల్ రన్‌కు దగ్గరికి వచ్చేసింది సరిలేరు నీకెవ్వరు. రెండు వారాల తర్వాత కూడా సరిలేరు నీకెవ్వరు సత్తా చూపించింది. అయితే మూడో వారం నుంచి పడిపోయింది ఈ చిత్రం. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో మంచి పోటీ ఇవ్వడంతో మహేష్ జోరు తగ్గించక తప్పలేదు. పక్కా కమర్షియల్ కథతో వచ్చిన సరిలేరు నీకెవ్వరు రికార్డ్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. సంక్రాంతి హాలీడేస్‌ను పర్ఫెక్టుగా వాడేసుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అల వైకుంఠపురములో కంటే కూడా హైయ్యస్ట్ ఓపెనింగ్స్ తీసుకొచ్చినా.. లాంగ్ రన్‌లో వెనకబడిపోయింది సరిలేరు నీకెవ్వరు.

ఇప్పటి వరకు నైజాంలో 39 కోట్లు షేర్ వసూలు చేసి ఔరా అనిపించాడు సూపర్ స్టార్. ఇక సీడెడ్‌లో 15.55 కోట్లు.. తూర్పు గోదావరి 10.06 కోట్లు.. ఉత్తరాంధ్ర 19.20 కోట్లు.. వెస్ట్ గోదావరి 7.57 కోట్లు.. గుంటూరు 9.87 కోట్లు.. కృష్ణా 8.82 కోట్లు.. నెల్లూరు 4.02 కోట్లు.. రెస్ట్ ఆఫ్ ఇండియా 10.02 కోట్లు.. నార్త్ అమెరికా 8.8 కోట్లు.. గల్ఫ్ 1.25 కోట్లు.. ఆస్ట్రేలియా 0.9 కోట్లు.. సింగపూర్ 0.4 కోట్లు.. లండన్‌ 0.35 కోట్లు.. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్‌ 0.56 కోట్లు వసూలు చేసింది. ఇదంతా కలిపి 200 కోట్లకు పైగా గ్రాస్.. 133 కోట్ల వరకు షేర్ వసూలు చేసి నిజంగానే సంక్రాంతి మొగుడు అనిపించుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. 

SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa