ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుప్రీం కోర్ట్ తీర్పు పై స్పందించిన విజయశాంతి...

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2020, 05:18 PM

మహిళలలో స్ఫూర్తి నింపే అవకాశం వచ్చింది.  సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మహిళా సాధికారతకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో 20 ఏళ్ల క్రితం నేను ఆర్మీ ఆఫీసర్ గా కన్న కల ఇప్పుడు సాకారం అయ్యింది. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు సైన్యాన్ని ముందుండి నడిపించడంలో తమ వంతు పాత్ర పోషిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు అని  విజయశాంతి చెప్పుకొచ్చారు.


‘ఐపీఎస్ అధికారిగా, లెక్చరర్‌గా, ప్రొఫెసర్‌గా, లాయర్‌గా, సీబీఐ అధికారిగా, మహిళా మంత్రిగా, ఆటోడ్రైవర్‌గా, ముఖ్యమంత్రిగా, జర్నలిస్టుగా, పారిశ్రామికవేత్తగా, అమాయకంతో నిండిన నిజాయితీ ఆడబిడ్డగా, అణగారిన వర్గాల హక్కులపై తిరగబడ్డ ఉద్యమ కారిణిగా… ఇంకా ఎన్నో, ఎన్నెన్నో అసంఖ్యాక పాత్రలతో మహిళలలో స్ఫూర్తి నింపే అవకాశం సుదీర్ఘమైన.. నా సినీ ప్రయాణం 1979 నుంచి.. ఇప్పటి వరకూ ప్రేక్షక దేవుళ్ల ఆశీస్సులు నాకు లభించింది.


వీటిలో నేను నటించి, అందరి ఆదరణ పొందిన బహుభాషా చిత్రం ‘భారతరత్న’. ఈ సినిమాలో నేను పోషించిన ఆర్మీ కమాండర్ పాత్ర.. తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రెండు దశాబ్దాల క్రితం నేను పోషించిన ఆర్మీ ఆఫీసర్ పాత్రను వాస్తవ రూపంలోకి తెచ్చేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మహిళా సాధికారతకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో 20 ఏళ్ల క్రితం నేను ఆర్మీ ఆఫీసర్‌గా కన్న కల ఇప్పుడు సాకారం అయ్యింది. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు సైన్యాన్ని ముందుండి నడిపించడంలో తమ వంతు పాత్ర పోషిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదంటూ’ ఆమె ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa