ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చూపులో కూడా రెజీనా అమాయకత్వం చాలానే కనిపిస్తోంది

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 09, 2018, 05:03 PM

సినిమా ఇండస్ట్రీలో నటించే ప్రతి హీరోయిన్ అందంగా ఉంటారు. ఇందులో అనుమానం లేదు. కొంత మంది హీరోయిన్స్ కొందరికి నచ్చకపోవచ్చు కానీ స్టార్ట్ హీరోలతో నటించే నటీమణులు చాలా వరకు ఎంతో కొంత టాలెంట్ ఉండే ఉంటుంది. కానీ ఇండస్ట్రీలో హిట్స్ అందితేనే ఆమెకు తగిన గుర్తింపు ఉంటుంది. అంతే కాకుండా వారికీ తగ్గ వ్యక్తిగత గుర్తింపు కూడా కొంచెం స్టార్ డమ్ కి ఉపయోగపడుతుంది. ఈ సినిమాయా లోకంలో అందరు ఒకేలా ఉండరు పరిస్థితులను బట్టి మారాల్సి ఉంటుంది. 


ముఖ్యంగా హీరోయిన్స్ చాలా వరకు వచ్చిన కొత్తలో ఉన్నట్లు ఓ రెండు మూడేళ్ల తరువాత ఉండరు. ఎంతో కొంత మార్పు అయితే వస్తుంది. గ్లామర్ డోస్ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ కు వెళుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే తరహాలో మారిపోయిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. అందులో రెజీనా ఒకరు. అమ్మడు మొన్నటి వరకు ఎలాంటి పాత్రలను చేసిందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా నక్షత్రం లాంటి సినిమాలో చాలా ఘాటుగా కనిపించింది. 


ప్రస్తుతం కూడా అలాంటి ఆఫర్స్ వస్తే కాదనడంలేదు. కానీ చాలా రోజుల తరువాత రెజీనా చాలా కొత్తగా దర్శనం ఇచ్చింది. నిండు వస్త్రాలతో సౌమ్యంగా చీర కట్టులో కనిపించింది. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫొటోని చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే చూపులో కూడా రెజీనా అమాయకత్వం చాలానే కనిపిస్తోంది. మొత్తానికి రెజీనా ఈ లుక్ లో కూడా చాలా అందంగా ఉందని చెప్పవచ్చు. అయితే నెక్స్ట్ సినిమాలో రెజీనా ఈ తరహాలో కనిపిస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa