నేను అంబాని చిత్రంతో తమిళ నటుడు ఆర్య తెలుగు వారందరికీ పరిచయమే. వరుడు సినిమాలో అల్లు అర్జున్‌ను ఢీ కొట్టి అందర్నీ మెప్పించాడు. అయితే మళ్లీ వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నా ప్రస్తుతం అవి తెలుగులోకి అనువదిస్తున్నా విజయాన్ని అందుకోలేకపోతున్నాడు. చివరగా సూర్య హీరోగా వచ్చిన బందోబస్త్ సినిమాలోను ఆర్య కనిపించాడు. ఆర్య ప్రస్తుతం తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. ఆర్య.. తన కండలు తిరిగిన దేహాన్ని ప్రదర్శించాడు. అంతేకాకుండా ఓ ఆసక్తికరమైన కొటేషన్‌ను కూడా రాసుకొచ్చాడు. మీరెంత బలమైన వారో.. బలంగా తయారయ్యేవరకు తెలుసుకోలేరు.. అదొక్కటే దారి ఉందంటూ రేపు సాయంత్రం ఐదు గంటలకు తన మూవీ అప్‌డేట్ రాబోతోందని ట్వీట్ చేశాడు.
“You Never know how strong You are until Being strong is the only choice you have”
An Update about my next film at 5pm tomorrow #Arya30 #Prelook pic.twitter.com/I78DyhzRQY
— Arya (@arya_offl) February 19, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa