సోషల్ మీడియానే నమ్ముకుని హాటెస్ట్ ఫోటో షూట్స్ తో ఇరగదీస్తున్న హెబ్బా పటేల్ నితిన్ 'భీష్మ' సినిమాలో ఓ కీలక పాత్ర చేసింది అని తెలుసు. కానీ ఆ పాత్ర ఎలా ఉంటుంది. సెకండ్ హీరోయిన్ మాదిరి తేలిపోతుందా..? లేదంటే హెబ్బా గ్లామర్ కోసమే ఆమెని ఈ సినిమాలో పెట్టుకున్నారా..? అనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. తాజాగా 'భీష్మ' కథని మలుపు తిప్పే కీలకమైన పాత్రలో హెబ్బా పటేల్ నటించింది అని... ఈ సినిమా హిట్ అయిన తర్వాత హైలైట్స్ లో హెబ్బా పాత్ర ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ప్రస్తుతం కెరీర్ డౌన్ లో ఉన్న హెబ్బా కెరియర్ కి ఈ పాత్ర మంచి హెల్ప్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa