ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరు మూవీలో బన్నీ?

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2020, 08:12 PM

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమా మొహాలీ లాల్ నటించిన మలయాళం 'లూసిఫెర్' కు రీమేక్ అని కూడా వార్తలు వస్తున్నాయి. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, చరణ్ చిరంజీవి యుక్త వయస్సులో వున్నప్పటి పాత్రను చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ పాత్రను చరణ్ చేసే అవకాశం లేదనేది తాజా సమాచారం. ఇప్పటికే పలు లీక్ లు 'ఆర్.ఆర్.ఆర్' నుండి వస్తుండడంతో సినిమా పూర్తయ్యేవరకూ చరణ్ మరో ప్రాజెక్టు చేయకూడదనే షరతులు పెట్టాడట రాజమౌళి. ఆ సినిమాకి ముందు.. చరణ్ చేసిన మరో సినిమా విడుదల కాకూడదట. అందువల్లనే కొరటాల సినిమాలో చరణ్ చేసే అవకాశం లేకుండా పోయిందని తెలుస్తోంది. చరణ్ చేయాలనుకున్న ఆ పాత్రకు అల్లు అర్జున్ అయితే బాగుంటాడనే అభిప్రాయాన్ని కొరటాల వ్యక్తం చేశాడట. ఆ పాత్రను చేయడానికి అల్లు అర్జున్ కూడా ఉత్సాహాన్ని చూపుతున్నాడని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa