కమల్ హాసన్ తదుపరి చిత్రం భారతీయుడు -2 సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. కమల్‌హాసన్, కాజల్ ప్రధాన పాత్రలో శంకర్ తెరకెక్కిస్తున్న ‘ఇండియన్ 2’ సినిమాను తెలుగులో ‘భారతీయుడు 2’గా విడుదల చేయనున్నారు. గతంలో సంచలన విజయం సాధించిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా దీన్ని నిర్మిస్తున్నారు. సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.కాగా, ఈ సినిమా షూటింగులో అపశృతి చోటుచేసుకుంది. షూటింగ్ సమయంలో ఓ భారీ క్రేన్ కూలి.. ముగ్గురు చనిపోయారు. అలాగే.. డైరెక్టర్ శంకర్‌తో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై హీరో కమల్‌హాసన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ ‘ఇండియన్ 2’ సినిమా తీస్తున్నారు. చెన్నై శివార్లలోని పూనమల్లిలో ఈవీపీ ఫిల్మ్ సిటీలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పదిమంది వరకూ గాయపడ్డారు.సినిమా షూటింగ్ జరుగుతుండగా 150 అడుగుల భారీ క్రేన్ తెగిపడింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఓ లైట్‌బాయ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి,. శంకర్ సినిమా షూటింగ్‌లో పెను విషాదం చోటు చేసుకుందని కామెంట్లు పెట్టారు. డైరెక్టర్ శంకర్ సహా గాయపడిన వారిని చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డైరెక్టర్ ఉండే మానిటర్ దగ్గర పైన క్రేన్ పడిపోయింది. శంకర్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పిందని తమిళ జర్నలిస్టులు ట్వీట్ చేశారు. ఈ ప్రమాదంలో శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్లు మధు (29), కృష్ణ (34) మృతి చెందారని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో కమల్ హాసన్ సెట్లోనే ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa