ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెబ్ సిరీస్ లో హాట్ గా తేజస్వి

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 20, 2020, 09:55 AM

అసలే ఇండస్ట్రీలో ఇప్పుడు కమిట్మెంట్ అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఏ హీరోయిన్ ఎప్పుడు బయటికి వచ్చి తమను ఈ దర్శకుడు.. ఆ నిర్మాత వాడుకున్నాడు అని చెబుతోందో అని టెన్షన్ పడుతున్నారు దర్శకనిర్మాతలు. ఇలాంటి సమయంలో ఒక తెలుగమ్మాయి చాలా ధైర్యంగా కమిట్మెంట్ ఇస్తుంది. అయితే అది రియల్ లైఫ్ లో మాత్రం కాదు. వెబ్ సిరీస్ కోసమే. ప్రస్తుతం తెలుగులో వెబ్ సిరీస్ లకు కూడా డిమాండ్ బాగా పెరిగిపోయింది. దాంతో దర్శకనిర్మాతలు అటువైపుగా ఆలోచిస్తున్నారు. ఇక సినిమాల్లో సక్సెస్ కానీ హీరోయిన్లు కూడా వెబ్ సిరీస్ వైపు పరుగులు తీస్తున్నారు. తాజాగా తేజస్వి మదివాడ ఇదే చేస్తుంది.


సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంత చెల్లెలుగా నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఐస్ క్రీమ్, రోజులు మారాయి లాంటి చాలా సినిమాల్లో నటించింది. కానీ ఒక్క సినిమా కూడా గుర్తింపు తీసుకు రాలేదు. అందుకే ఇప్పుడు వెబ్ సిరీస్ కోసం రెచ్చిపోయి నటిస్తుంది తేజస్వి. తాజాగా లక్ష్మీకాంత్ చెన్న తెరకెక్కిస్తున్న కమిట్మెంట్ అనే వెబ్ సిరీస్ కోసం చాలా బోల్డ్ గా నటిస్తుంది తేజస్వి. ఇప్పుడు విడుదలైన ఈ వెబ్ సిరీస్ స్టిల్స్ చూస్తుంటే ఎంత హాట్ గా ఉండబోతుందో అర్థమవుతుంది. అవకాశాల కోసం పూర్తిగా హద్దులు దాటేస్తున్నట్లు కనిపిస్తుంది తేజస్వి మదివాడ.


కంటెంట్ డిమాండ్ చేసినప్పుడు ఆమాత్రం బోల్డ్నెస్ తప్పు లేదు అంటోంది ఈ ముద్దుగుమ్మ. ఒకే బెడ్ పై పడుకోవడం.. లిప్ టు లిప్ హాట్ హాట్ కిస్ ఇచ్చుకోవడం ఇవన్నీ ఈ ఫోటోలో కనిపిస్తున్నాయి. ఇది చూస్తుంటే కమిట్మెంట్ వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగానే వేచి చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ వెబ్ సిరీస్ విడుదలైన తర్వాత కచ్చితంగా తనకు సినిమా అవకాశాలు కూడా వస్తాయని నమ్ముతుంది తేజస్వి. మరి ఈమె నమ్మకాన్ని కమిట్మెంట్ ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa