ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కమల్ హాసన్ కోటి రూపాయల సాయం

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 20, 2020, 06:16 PM

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు వెండితెరపై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న 'ఇండియన్ 2' సినిమా సెట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా ఈ చిత్ర షూటింగ్ మధ్యప్రదేశ్, గ్వాలియర్ ప్రాంతంలో జరిగింది. కొత్త షెడ్యూల్ కోసం చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో భారీ సెట్స్‌ వేస్తున్నారు. అందులో 150 అడుగుల ఎత్తులో క్రేన్‌తో లైటింగ్‌ పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా అది తెగి కిందనే ఉన్న టెంట్‌పై పడింది. ఈ ప్రమాదం లో ముగ్గురు మరణించగా.. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతిచెందిన వారిలో శంకర్‌ పర్సనల్‌ సెక్రటరీ మధు, సినిమా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సాయికృష్ణ, సహాయకుడు చంద్రన్‌ ఉన్నారు. ఈ ఘటన పట్ల కమల్ హాసన్ , కాజల్ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం తన మనసుని కలిచివేసిందని, ముగ్గురు సహాయకులను కోల్పోవడం బాధాకరమన్నారు. అలాగే మరణించిన కుటుంబాలకు కోటి రూపాయల సహాయాన్ని అందిస్తున్నట్టు కమల్ హాసన్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa