ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూరి సినిమా తరువాత.. విజయ్ నెక్స్ట్ మూవీ అప్డేట్...

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2020, 01:06 PM

విజయ్ దేవరకొండతో ప్రస్తుతం పూరి జగన్నాథ్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. విజయ్ దేవరకొండ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. తెలుగుతో పాటు హిందీ .. తమిళ .. మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా కారణంగా ఆయా భాషల్లో ఆయన మార్కెట్ మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఈ నేపథ్యంలో సహజంగానే ఆయన తదుపరి సినిమాపై అందరిలోను ఆసక్తి నెలకొంది. పూరి జగన్నాథ్ సినిమాను పూర్తి చేసిన తరువాత ఆయన మారుతితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మారుతి ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్టు పైనే కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. మారుతి దర్శకత్వంలో ఈ మధ్య వచ్చిన 'ప్రతిరోజూ పండగే' సినిమా విజయాన్ని సొంతం చేసుకుంది. కుటుంబాలు .. బంధాలు .. అనుబంధాల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక విజయ్ దేవరకొండ కోసం ఆయన తయారు చేస్తున్న కథ ఎలా ఉంటుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa