అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్‌కి స్వాగతం పలకబోతున్న సౌత్ ఇండియన్ స్టార్స్.. నిజమనుకునేరు.. ఇదంతా కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ క్రియేటివిటీ. వివాదాలతో సావాసం చేసే వర్మ శనివారం సరికొత్త ట్వీట్ చేసాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24న భారత్ పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే.
అహ్మదాబాద్, ఆగ్రా, ఢిల్లీ ప్రాంతాలను పర్యటించనున్న ట్రంప్.. పూర్తి షెడ్యూల్ కొన్ని వారాల క్రితమే ఫిక్స్ అయింది. ట్రంప్ పర్యటనకోసం కేంద్రం భారీగా ఖర్చు పెడుతోంది. ఆయనకు అక్షరాలా కోటిమందితో స్వాగతం పలకాలని ప్లాన్ చేస్తున్నారు ప్రధాని మోడీ. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన స్టైల్‌లో ట్వీట్ చేసాడు.
ట్రంప్‌కు స్వాగతం పలకడానికి కోటిమంది రావాలంటే.. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, రజనీకాంత్, కత్రినా కైఫ్, దీపికా పదుకొణె, సన్నీ లియోన్‌లను వరసగా నిలబెడితే.. వాళ్లని చూడడానికి పెద్ద సంఖ్యలో జనాలు వస్తారు. అప్పుడు మీరనుకుంటున్నట్టుక కోటిమంది అవుతారు.. అంటూ వ్యంగ్యంగా ట్వీటాడు. ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
The only way @realDonaldTrump ‘s claim there will be 10 million people to welcome him in india can come true is, if they manage to line up Amitabh Bachchan, Salman Khan , Amir Khan, Sharuk Khan , Rajnikant, Katrina Kaif, Deepika Padukone and SUNNY LEONE to stand next to TRUMP
— Ram Gopal Varma (@RGVzoomin) February 22, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa