తమిళంలో రెండు సినిమాలను అంగీకరించింది నటి సమంత. ఒక సినిమాలో ఆమె నయనతారతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది. విఘ్నేశ్ శివన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక మరో సినిమాలో ఆమె హీరో ప్రసన్న జోడీగా కనిపించనుంది. ఈ సినిమాకి అశ్విన్ శరవణన్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. గతంలో తమిళంలో నయనతార ప్రధాన పాత్రధారిగా అయన రూపొందించిన ‘మాయ’ అక్కడ ఘన విజయాన్ని సాధించింది. అదే సినిమా తెలుగులో ‘మయూరి’గా విజయవంతమైంది. ఇప్పుడు అదే దర్శకుడి సినిమాలో సమంత చేయనుంది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa