ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గరుడవేగ దర్శకుడు ప్రవీణ్ సత్తారు తో మహేష్ బాబు ..... !

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2020, 03:44 PM

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమా  తో హిట్ కొట్టిన మహేష్ బాబు . ఆయన తదుపరి సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కాల్సింది. అయితే, కొన్ని కారణాల వలన ఈ సినిమా ఆలస్యం అయ్యేలా ఉందట. ఈ నేపథ్యంలో మహేష్ కొత్త కథలు కోసం చూస్తున్నటు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇటీవల గరుడవేగ దర్శకుడు ప్రవీణ్ సత్తారు మహేష్ కి ఓ కథ వినిపించినట్టు సమాచారమ్.


ప్రవీణ్ చెప్పిన కథకు మహేశ్ ఇంప్రెస్ అయ్యాడని అంటున్నారు. కథ నచ్చడంతో కొద్దిపాటి మార్పులు కూడా చెప్పాడని సమాచారం. ఈ సినిమాపై త్వరలోనే క్లారిటీ రానుంది. యువ దర్శకులకి అవకాశం ఇవ్వాలని మహేష్  భావిస్తున్నారు. గతంలో సందీప్ రెడ్డి వంగాతో మహేష్ ఓ సినిమా చేయాలనుకొన్నారు. కానీ, కొన్ని కారణావల వలన అది జరగలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa