"కలలు కన్న రోజు ఇది. నేను ఎప్పటి నుండో ఎవరితో పని చేయాలనుకుంటున్నానో, ఎవరికి సంగీతం అందించాలనుకుంటున్నానో ఆయన్ని కలిశా. నేను స్వరపరిచిన పాటలను ఆయనకు వినిపించా. నెర్వస్‌గా ఫీలయ్యా. ప్రేమ, ఒత్తిడిలో విపరీతంగా చెమటలు పట్టేశాయని" సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ తెలిపాడు. ఫైనల్లీ… అదంతా ప్రేమ, గౌరవమే. త్వరలో తొలి పాటతో మేం మీ ముందుకు వస్తున్నాం. లవ్యూ సార్” అని తమన్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. పింక్ రీమేక్ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సందర్భంగా నటుడు పవన్ కల్యాణ్ ని కలిసిన ఆయన, ‘పింక్’ రీమేక్ కోసం తాను స్వరపరిచిన పాటలు వినిపించాడట. ట్వీట్‌లో ఎక్కడా పవన్ పేరు గానీ, ‘పింక్’ రీమేక్ అని గానీ తమన్ ప్రస్తావించలేదు. అయితే… ఓ నెటిజన్ ‘పవన్‌కల్యాణ్ 26వ సినిమా’ అని ఇచ్చిన రిప్లైకు లైక్ కొట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa