అల... వైకుంఠపురములో హిట్ ఊపు మీద ఉన్న అల్లు అర్జున్ , తన ఫాన్స్ కి ఓ తీపి బహుమతి ఇవ్వబోతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ సినిమా విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మొత్తంగా రూ. 155 కోట్ల షేర్ రాబట్టి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను తీసుకొచ్చింది. ముఖ్యంగా తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో అల్లు అర్జున్ బాక్సాఫీస్ దగ్గర సరైనోడు అనిపించుకున్నాడు.నైజాంలో అయితే ఏకంగా రూ.40 కోట్ల షేర్ వసూలు చేసి కొత్త రికార్డులకు తెరతీసాడు అల్లు అర్జున్. బాహుబలి కాకుండా మరో సినిమా ఏదీ నైజాంలో 35 కోట్ల మార్క్ అందుకోలేదు. మొత్తంగా ఏపీ తెలంగాణలో 125 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ చిత్రం.ఇక ఓవర్సీస్‌లో 18.50 కోట్ల మార్క్ అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 155 కోట్ల షేర్ వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకున్నాడు బన్నీ. తాజాగా ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చే డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమాను డిజిటల్ శాటిలైట్ హక్కులను జెమిని వాళ్లు భారీ రేటుకే కొనుగోలు చేసారు. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, హాట్ స్టార్ వంటి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ కాదని సన్ నెక్ట్స్ వాళ్లు ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ రేటుకే కొనుగోలు చేసారు.
ఈ సినిమాను ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈనెల 26న సన్ నెక్ట్స్‌లో ప్రసారం కానుంది. అంటే విడుదలైన 46 రోజులకు ఈ సినిమా టీవీల్లో ప్రదర్శితం కానుంది. ఇప్పటికే ‘అల వైకుంఠపురములో’ థియేట్రికల్ రన్ ముగియడానికి వచ్చింది. దీంతో రేపు (ఫిబ్రవరి 26) డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రదర్శితం కానుంది. మొత్తానికి థియేట్రికల్ రన్ ముగిసిన ఈ చిత్రం డిజిటల్ ప్రదర్శనకు రెడీ కావడం చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా థియేటర్‌లో ఈ సినిమా చూడలేని వాళ్లు ఎంచక్కా డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో చూడొచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa