ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టబు పోషించిన పాత్రలో.. అనసూయ

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 27, 2020, 02:30 PM

ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ మెగా ఆఫర్లు తన్నుకొస్తున్నాయి. గతంలో అనసూయ ‘క్షణం’, ‘రంగస్థలం’ సినిమాలతో తానేంటో నిరూపించుకున్నారు. ‘కథనం’ సినిమాలో లీడ్ రోల్‌లో నటించి సినిమాను తన భుజాలపై మోసారు. ఎలాంటి పాత్రలోనైనా నటించే సత్తా ఉందని నిరూపించుకున్నారు. ఈ సినిమా తర్వాత అనసూయని కీలక పాత్రల కోసం పరిగణలోనికి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్ టబు పాత్రని అనసూయ కొట్టేసినట్టు సమాచారమ్.


భీష్మ తో మంచి హిట్ అందుకున్న నితీన్.. హిందీలో సూపర్ హిట్ అయిన 'అంధధూన్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఇటీవల పూజ కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమాలో హిందీలో టబు నటించిన పాత్రలో.. అనసూయ నటిస్తుందని వార్తలొచ్చాయ్. తాజా సమాచారమ్ ప్రకారం ఈ సినిమాలో అనసూయని ఖాయం చేసినట్టు తెలుస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa