ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ దేవరకొండ చాలా స్మార్ట్ అండ్ కైండ్ : అనన్య పాండే

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 27, 2020, 05:53 PM

విజయ్ దేవరకొండ తన తాజా చిత్రాన్ని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. పూరి సొంత బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమాకి, కరణ్ జొహార్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాకి 'ఫైటర్' .. 'లైగర్' అనే రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ జోడీగా అనన్య పాండేను తీసుకున్నారు. కొన్ని రోజులుగా ముంబైలో జరుగుతున్న షూటింగులో ఇటీవలే ఆమె జాయిన్ అయింది.  


తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. " విజయ్ దేవరకొండ చాలా స్మార్ట్ అండ్ కైండ్. అందరితోనూ చాలా కలుపుగోలుగా మాట్లాడతాడు. సెట్లో ఎప్పుడూ నవ్వుతూ సందడి చేస్తుంటాడు. కొత్తవారితో సంభాషణను కొనసాగించడం ఆయనకి బాగా తెలుసు. విజయ్ దేవరకొండ మంచి ఆర్టిస్ట్ అని విన్నాను. ఆయనతో ఈ సినిమా చేస్తున్నందు వలన ప్రత్యక్షంగా చూస్తున్నాను. తనతో కలిసి పనిచేయడం చాలా సంతోషాన్నిస్తోంది" అని చెప్పుకొచ్చింది. ప్రముఖ నటుడు చుంకీ పాండే కూతురైన అనన్య ఈ సినిమా ద్వారానే పరిచయమవుతోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa