ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సూర్య' సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న'మోహన్ బాబు'

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 28, 2020, 07:45 PM

చాలా గ్యాప్ తర్వాత తమిళ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. తమిళ నటుడు సూర్య హీరోగా వస్తున్న 'ఆకాశమే నీహద్దురా' చిత్రంలో టాలీవుడ్ అగ్రనటుడు మోహన్ బాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన లుక్ ను మోహన్ బాబు ట్విట్టర్ లో పంచుకున్నారు. భారత వాయుసేనకు చెందిన అధికారిగా మోహన్ బాబు ఎంతో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. తెలుగు, తమిళ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గురు ఫేమ్ సుధా కొంగర దర్శకత్వం వహిస్తోంది. ఇప్పటికే విడుదల ఈ సినిమా టీజర్ కు మంచి ఆదరణ లభిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa