ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైజాగ్లో వరుణ్ తేజ్ మూవీ రెగ్యులర్ షూటింగ్!

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 29, 2020, 02:22 PM

వరుణ్ తేజ్ తన తర్వాతి సినిమాను బాక్సర్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వైజాగ్లో జరుగుతుంది. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం కోసం వరుణ్ ప్రత్యేకంగా బాక్సింగ్ శిక్షణ తీసుకున్నారు.  ఈ సినిమాని కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్నారు.  ఈ చిత్రం కోసం నిర్మాతలు అల్లు బాబీ, సిద్దు ముద్దలు దాదాపు రూ.35 కోట్ల వరకు ఖర్చు పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం వరుణ్ బరువు తగ్గి ఫిట్ లుక్ తెచ్చుకున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుందని సమాచారం. ఇకపోతే మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిచనున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa