మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ‘చిరు 152వ’ సినిమాలో అతిధి పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో చిరు రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా లో ఒక పాత్ర కోసం చిరు నక్సలైట్ గా కనిపించనున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఒక కీలక పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నారని ఈ మధ్య వార్తలు తెగ షికార్లు చేస్తున్నాయి . ఈ పాత్రకోసం మహేష్ 30 రోజుల కాల్ షీట్ ఇచ్చాడని రోజుకు కోటి రూపాయల చొప్పున 30 కోట్లు తీసుకుంటున్నదని తెలుస్తుంది. అయితే తాజగా ఈ పాత్ర కోసం అల్లు అర్జున్ పోటీ పడుతున్నాడని తెలుస్తుంది.
అసలు ఈ పాత్ర రామ్ చరణ్ చెయ్యాల్సి ఉంది కానీ డేట్స్ అడ్జెస్ట్ కాక , ఆ ప్లేస్ లో మహేష్ ను తీసుకున్నారు. ఇప్పుడు ఆ పాత్ర తాను చేస్తానంటూ బన్నీ ముందుకు వచ్చాడు. చిరు తో స్రీన్ షేర్ చేసుకోవాలని బన్నీ ఎప్పటినుంచో చూస్తున్నాడు. ఇందుకోసం అల్లు అరవింద్ తో సంప్రదింపులు చేస్తున్నాడట బన్నీ . వ్యక్తిగతంగా కూడా మహేష్ అంటే చిరుకు ఎంతో అభిమానం... మహేష్ చరణ్ కి బాగా క్లోజ్. ఆ రకంగా ఆ ఇద్దరూ మహేష్ వైపే మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం సాగుతోంది. ఒకవేళ మహేష్ ఓకే అయితే మెగా ఫ్యాన్స్ కు బన్నీ ఫ్యాన్స్ కు దూరం పెరిగే అవకాశం లేకపోలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa