సౌత్ సినిమా ప్రేక్షకులకు నయన్ తార పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోలతో సమానముగా రెమన్యురేషన్ తీసుకునే స్టార్ నయన్. తెలుగులో వెంకటేష్ నటించిన 'లక్ష్మి' సినిమాతో పరిచయమైనా ఈ సుందరి ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సరసన 'సైరా' సినిమాలో నటించి మెప్పించింది నయన్. తాజా నయన్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ లుక్ లో నయన్ అమ్మవారిగేటప్ లో ఉంది. ఇక లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా అదరగొడుతుంది. తమిళ్ లో వరుసగా విజయాలను అందుకుంది ఈ చిన్నది. తమిళ సినిమా 'మూకుత్తి అమ్మన్' సినిమాలో నయన్ అమ్మవారి గెటప్‌లో దర్శనమివ్వబోతుంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో నయన్ అమ్మవారి రూపంలో కనిపించి, ఆకట్టుకుంటోంది. ఈ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa