వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ3 వారాల క్రితం హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచార ఘటనపై ఒక సినిమా తీస్తున్నానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. వాస్తవిక ఘటనలను సినిమాలుగా మార్చడంలో వర్మ ఎప్పుడూ ముందే ఉంటాడు. ఈయన కథల కోసం పెద్దగా వెతకడు.. కాంట్రవర్సీలే ఈయనకు కథలు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు వర్మ. కొన్నేళ్లుగా కేవలం రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఉండే కథలను మాత్రమే సినిమాలుగా తెరకెక్కిస్తున్న వర్మ.. ఇప్పుడు దిశ ఘటనపై ఫోకస్ చేసాడు. ఇది జరిగిన విధానం.. దోషులు మరణించిన విధానం చూసిన తర్వాత కచ్చితంగా ఎవరో ఒకరు సినిమా చేస్తారనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతుంది. చివరికి అది వర్మ అనౌన్స్ చేసాడు. తన నెక్ట్స్ సినిమా దిశ అంటూ ఈ మధ్యే ట్వీట్ చేసాడు ఈయన. అంతేకాదు ఈ చిత్రంలో చాలా భయంకరమైన నిజాలు చెప్పబోతున్నానని ప్రకటించాడు. ఇప్పుడు చిత్ర షూటింగ్ మొదలుపెట్టాడు ఈయన.
రేప్ చేయాలనుకునే వాళ్లు భయంతో వణికిపోయేలా తన సినిమాలో సన్నివేశాలు ఉంటాయని.. అలాంటి వాళ్లకు ఓ లెసన్ తన సినిమా నేర్పిస్తుందని చెప్పాడు వర్మ. న్యాయశాస్త్రాన్ని అడ్డుపెట్టుకుని లాయర్ ఏపీ సింగ్ లాంటి వాళ్లు ఆడుకుంటున్నారు.. వాళ్లతో ఆడుకునేలా తన సినిమా ఉంటుందని చెప్పాడు వర్మ. ఏపీ సింగ్ నిర్భయ దోషుల తరఫున వాదిస్తున్నాడు. వాళ్లకు ఉరి పడకుండా వాయిదాలు పడేలా చేస్తున్నాడు. అలాంటి వాళ్లే తన సినిమాలో విలన్స్ అంటున్నాడు ఈయన. దిశ ఘటన తర్వాత రేపిస్టులు ఏం నేర్చుకోలేదని.. ఇంకా అలాంటి ఘటనలు ఆగలేదని తెలిపాడు వర్మ.
అలాంటి వాళ్లకు తన సినిమాలో ఎలా శిక్షించాలో చూపిస్తానంటున్నాడు వర్మ. అసలు దిశ ఘటన ఎలా జరిగింది.. ఆ రోజు ఏం జరిగింది.. ఎందుకు వాళ్లు అలా చంపేయాల్సి వచ్చింది అనే ఘోర నిజాలు కూడా తన సినిమాలో చూపిస్తానంటున్నాడు ఈయన. ప్రతీ విషయం క్షుణ్ణంగా దిశ సినిమాలో ఉంటాయని చెప్పాడు ఆర్జీవీ. జనం కూడా దిశ లాంటి ఘటనలు జరిగినపుడు వెంటనే శిక్ష పడితే సంతోషిస్తారని చెప్పాడు. దిశను ఎక్కడైతే కాల్చి చంపారో.. అక్కడే ఆ చటాన్ పల్లి సమీపంలోనే తొలి షాట్ చిత్రీకరించాడు వర్మ. దీనికి సంబంధించిన షూటింగ్ అక్కడ జరుగుతుంది.
ఫిబ్రవరి 29 రాత్రి రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి బ్రిడ్జి కింద వద్ద ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించారు. వెటర్నరీ డాక్టర్ దిశపై జరిగిన అత్యాచార ఘటనలోని కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నాడు వర్మ. ఈ క్రమంలోనే దిశపై తొండుపల్లి టోల్ గేట్ వద్ద అత్యాచారం చేసిన తర్వాత మృతదేహాన్ని చటాన్‌పల్లి శివారులో దహనం చేసేందుకు లారీలో తీసుకొచ్చే సన్నివేశాన్ని చిత్రీకరించారు. మృతదేహాన్ని కాల్చడం, స్కూటీ, లారీతో సన్నివేశాన్ని చిత్రీకరించారు. కాగా గతేడాది దిశపై జరిగిన అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఆ తర్వాత నిందితులను పది రోజులకే కాల్చి చంపారు పోలీసులు. ఇప్పుడు ఈ చిత్రంలో మరింత క్లుప్తంగా చూపించబోతున్నాడు వర్మ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa