ఒకప్పుడు కన్నడ సినిమా అంటే అనామక ఇండస్ట్రీ అన్న పేరుండేది. కానీ ఆ అభిప్రాయాన్ని తుడిచిపెట్టేసిన సినిమా కేజీఎఫ్. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా తో ఒక్కసారిగా కన్నడ హీరో యశ్ పేరు దేశవ్యాప్తంగా మారు మ్రోగింది . ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కు ప్రస్తుతం సీక్వెల్ రాబోతుంది. 'చాఫ్టర్ 2' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాను ఈ ఏడాది జులైలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాగా హీరో యష్ కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కు ను ఒక కోరిక కోరాడట అదేంటంటే బెంగుళూరులో ఓ పెద్ద ఫిల్మ్ సిటీ నిర్మించాలని యష్ కోరాడు. కన్నడ చిత్ర సీమ ఇంత అభివృద్ధి చెందిన కొన్ని అవసరాల కోసం పక్కరాష్ట్రాలకు వెళ్లాల్సివస్తుందని.. ఆ అవసరం లేకుండా బెంగుళూర్ లో ఒక ఫిలింసిటీ ఏర్పాటు చేయాలనీ యష్ కోరాడు . యష్ కోరికను సీఎం యడ్యూరప్ప పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa