ప్రస్తుతం టాలీవుడ్ లో వరస హిట్స్ తో టాప్ లో ఉంది రష్మిక. ఇటీవల 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో సూపర్ హిట్ అందుకొని, ఆ తరువాత భీష్మ తో పలకరించి స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లోకి చేరిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మా తెలుగులో క్రేజీ ఆఫర్స్ ను అందుకుంటుంది. తాజాగా సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాలోనూ హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఆ తరువాత ఎన్టీఆర్ ,త్రివిక్రమ్ సినిమాలో కూడా రష్మిక పేరును కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఈ అమ్మడు ఆరు నెలలక్రితం మాంసాహారాన్ని మానేయాలని నిర్ణయించుకుందట. ఇప్పటి వరకు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉందంట ఈ భామ. మాములుగా రష్మిక కు నాన్ వెజ్ అంటే ప్రాణం కానీ తినకుండా డైట్ ముయింటెన్ చేస్తుంది. హీరోయిన్ గా రాణించాలంటే నటనతో పాటు అందమైన శరీరాకృతి కూడా కావాలిగా మరి అయితే ఈ బ్యూటీ ఇటీవల మాంసాహారంతో పోజిచ్చిన ఫొటో ఒకటి బయటికొచ్చింది. అది కేవలం యాడ్ కోసమేనని చెప్పింది రష్మిక.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa