తరచూ ఫొటో షూట్ లతో తనలోని కొత్త అందాలను ఆవిష్కరిస్తున్న నటి రాశీఖన్నా తాజా ఫోటో షూట్ ప్రస్తుతం అభిమానుల్లోకి దూసుకెళుతోంది. రాశీ నాజూకు నడుము ఎలివేషన్ కి సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. వైట్ ఆఫ్ టీ షర్ట్- బ్లాక్ టైట్ లెగ్గిన్ ధరించింది. అంతేకాదు రెండు చేతులు పైకెత్తి తన నడుమందాన్ని చూపించిన తీరు అదిరిపోయింది. రాశీ నడుము సొగసును వర్ణించే పనిలో పడ్డారంతా. ఏ హీరోయిన్ అయినా తన గ్లామర్ సైడ్ ఫోటో షూట్ దేనికి అంటే.. అదిరే అవకాశాల కోసమే…. రాశీఖన్నాకి ఇటీవల అవకాశాలు తగ్గాయ్. ఇప్పటికిప్పుడు కేవలం రెండు సినిమాలే చేతిలో ఉన్నాయి. తమిళం లో సైతాన్ కా బచ్చా- అరన్మనై 3 చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో ఇంకా ఏ ప్రాజెక్ట్ కన్ఫమ్ కాలేదు. మరి ఈ ఫోటో చూసి ఏమైనా అవకాశాలు వస్తాయోమో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa