నిధి అగర్వాల్ నాగ చైతన్య హీరోగా నటించిన ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాపైనా హీరోయిన్‌గా నిధి అగర్వాల్ అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత అక్కినేని చిన్నోడు అఖిల్ హీరోగా నటించిన ‘Mr మజ్ను’ సినిమాలో యాక్ట్ చేసింది. ఈ సినిమా కూడా ఫ్లాపైంది. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఈ అమ్మడు కెరీర్ మారిపోయింది. ఆ తర్వాత నిథి అగర్వాల్ టాలీవుడ్ హాట్ భామగా క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ.. రవితేజ సరసన యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో నిథి అగర్వాల్ నటిస్తుందట.
రమేష్ వర్మ.. బెల్లంకొండతో చేసిన రాక్షసుడుతో మంచి విజయాన్నే అందుకున్నాడు. ఇపుడు రవితేజతో చేయబోతున్న సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కబోతున్నట్టు సమాచారం. మరి రవితేజతో చేయబోతున్న మూవీతో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ కెరీర్‌కు ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa