టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సమన్లు పంపించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. లైకప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. ఇటీవల భారతీయుడు- 2 సినిమా షూటింగ్ స్పాట్ భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సడన్ గా 150 ఫీట్స్ ఎత్తు నుంచి క్రేన్ కూలిపోవడంతో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు చనిపోవడం జరిగింది.
ఈ వ్యవహారంలో చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు లైకా ప్రొడక్షన్స్ వాళ్లతో పాటు దర్శకుడు శంకర్, హీరో కమల్ హాసన్ లను చెన్నై ఎగ్మోర్ పోలీస్ కమిషనరేట్ ఆఫీసుకు పిలిపించి విచారణ చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న కాజల్ అగర్వాల్ కు చెన్నై పోలీసులు సమన్లు పంపినట్టు సమాచారం తెలుస్తోంది. ఆమె ప్రశ్నించడానికి పోలీసులు రెడీ అవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa