శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిన్న, క్యూట్, రొమాంటిక్ విడియో బిట్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది లవ్ స్టోరీ సినిమా. చైతూ-సాయిపల్లవిలతో చేస్తున్న సినిమా. ఈ సినిమా ఏప్రియల్ 14న విడుదల అని వినిపించింది. కానీ వాయిదా పడుతుందనే వార్తలు కూడా వినిపించాయి . ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్‌లో జాప్యం వల్ల ఈ చిత్రాన్ని మే 29కు వాయిదా వేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం నిజ జీవితంలో జరిగిన కొన్ని పరువు హత్యల ఆధారంగా శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. అలాగే క్లైమాక్స్ విషాదాంతంగా కూడా ఉండబోతున్నట్లు టాక్. మరి ఇందులో నిజమెంత..? ఈ సినిమాను శేఖర్ కమ్ముల ఎలా తెరకెక్కించబోతున్నారు..? అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఫిదా తరువాత దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకొన్న శేఖర్ కమ్ముల ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఆ మధ్య ఈ మూవీ నుంచి వచ్చిన ఓ పాట టీజర్ అందరినీ ఆకట్టుకోవడంతో సినిమాపై అటు చైతూ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa