ఆరెంజ్ కలర్ శారీ కట్టి డీసెంట్ గానే అందాలను ఆరబోసింది బాలీవుడ్ నటి భూమి పడ్నేకర్.. ఈ ఫోటో లో ఓ వైపు చిలిపిగా.. కవ్వింపు గా చూస్తోంది. ఈ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. కుర్రకారు మాత్రం చీరలోని ఆమె అందాలకు ఫిదా అవ్వని వారు లేనే లేరంటే అతిశయోక్తి లేదు. అంతేకాదు కళ్ళర్పకుండా ఆమె అందాలను ఆస్వాధించేస్తున్నారు ఫ్యాన్స్. చిరునవ్వులు చిందిస్తూ ఓ పక్కకి తలతిప్పి ఫోటోకి ఫోజులిచ్చింది ఈ బ్యూటీ. కెరీర్ పరంగా చూస్తే.. ప్రస్తుతం భూమి `డాలీ కిట్టీ ఔర్ వాహ్ చమక్త్ సితారె`.. `దుర్గావతి చిత్రాల్లో నటిస్తుంది. ఇందులో `దుర్గావతి` తెలుగులో అనుష్క కథా నాయికగా వచ్చిన `భాగమతి`కి రీమేక్ కావడం విశేషం. అశోక్ కుమార్ దర్శకత్వం వహించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa