నిర్మాణ సంస్థ: భవ్య క్రియేషన్స్
నటీనటులు: విశ్వంత్ దుడ్డుంపూడి, సంజయ్ రావు, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు
కథ – స్క్రీన్‌ప్లే- మాటలు – దర్శకత్వం: చెందు ముద్దు
నిర్మాత: వి.ఆనందప్రసాద్
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
ఆర్ట్: వివేక్ అన్నామలై
ఎడిటర్: డి.వెంకట ప్రభు
కెమెరా: సునీల్ కుమార్.ఎన్.,
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అన్నేరవి
విడుదల: 06.03.2020
టాలీవుడ్‌లో వచ్చే ప్రతి చిన్న సినిమాకు హైప్ క్రియేట్ అవ్వదు. చిన్న సినిమా జనాల్లోకి వెళ్లాలంటే దానికి బోలెడంత ప్రచారం అవసరం. అది కూడా ప్రేక్షకులను ఆకర్షించేలా వైవిధ్యంగా ఉండాలి. లేదంటే ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఉన్న సూపర్ స్టార్లతో ప్రచారం చేయించాలి. ఇటీవల గట్టిగా ప్రమోట్ చేసుకున్న సినిమా 'ఓ పిట్ట కథ'. ఈ సినిమాతో నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావ్ హీరోగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. ఈ సందర్భంగా చిరు 152 చిత్రం టైటిల్ 'ఆచార్య' అంటూ లీక్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ప్రమోషన్స్ తో ఊపు తీసుకొచ్చిన 'ఓ పిట్ట కథ' ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. ఓ పిట్ట కథ ప్రేక్షకులని నచ్చిందా.. ?
కథ:
వెంకట లక్ష్మి (నిత్య శెట్టి) కిడ్నాప్ అవుతుంది. దీనిపై పోలీసులకి ఫిర్యాదు చేసేందుకు వస్తారు విశ్వంత్, వెంకట లక్ష్మి తండ్రి. అసలు ఏం జరిగింది తెలుసుకొనే క్రమంలో ఎస్సై బ్రహ్మాజీ వెంకట లక్ష్మీ-విశ్వంత్ ల ప్రేమకథని వెంటాడు. అయితే విశ్వంత్ వెళ్తూ వెళ్తూ తనకి ప్రభు (సంజయ్ రావ్) మీద తనకు అనుమానం ఉందని చెబుతాడు. ప్రభుని విచారించిన బ్రహ్మాజీ ఓ క్లూ దొరుకుంది ? ఆ క్లూ ఏంటీ ? ఇంతకీ వెంకట లక్ష్మీని ఎవరు కిడ్నాప్ చేశారు అనేది సస్పెన్స్ తో కూడిన ఓ పిట్ట కథ.
ప్లస్ పాయింట్స్ :
* కథ-కథనం
* ట్విస్టులు
* కామెడీ
* సంగీతం
మైనస్ పాయింట్స్ :
* సినిమా స్లోగా సాగడం
నటీనటుల ఫర్ ఫామెన్స్ :
టైటిల్ కి తగ్గట్టుగానే చిన్నగా మొదలై ట్విస్ట్ లతో కథని ముందుకు నడిపాడు దర్శకుడు. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు, కామెడీ ప్రేక్షకులని అలరిస్తాయి. రొమాన్స్ బాగుంది. అయితే.. కథ స్లోగా సాగడం మైనస్ గా అనిపించింది. ఇక నటీనటుల విషయానికొస్తే.. విశ్వంత్ కి నటుడిగా అనుభవం ఉంది. పలు వేరియేషన్స్ చూపించగలిగే పాత్ర ఒదిగిపోయి నటించారు. నిత్యా శెట్టి నటన బాగుంది. సంజయ్ రావ్ కు ఇది తొలి సినిమా. బాగా నటించాడు. అయితే.. ఎక్స్ ప్రెషన్స్ విషయంలో ఇంకా చాలా మెరుగుపడాలి. ఎస్సై పాత్రలో బ్రహ్మాజీ ఒదిగిపోయాడు. ఈజీగా నటించేశారు. పండు పాత్ర ఆకట్టుకుంటుంది. ఆ పాత్ర మంచి వినోదాన్ని పండించింది.
సాంకేతికంగా :
ప్రవీణ్ లక్కరాజు అందించిన సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేలా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ బానే ఉంది. కానీ.. సినిమా బాగా స్లోగా సాగింది. ప్రేక్షకుడు కథకి కనెక్ట్ కాలేకపోతే.. బోర్ గా ఫీలవుతాడు. చందు ముద్దు డైరెక్షన్ కి మంచి మార్కులే పడ్డాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
రేటింగ్ : 2.75/5
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa