దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం భాషల్లోనూ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో 'అరవింద సమేత వీర రాఘవ' వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత తాజాగా NTR 30 పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసినీ బ్యానర్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతోన్న ఈ చిత్ర షూటింగ్ జూన్ లేదా జూలైలో ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పిరియాడిక్ ఫిల్మ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. తెలుగు వీరుల కథతో వస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తుంటే, రామ చరణ్ అల్లూరి సీతరామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా దాదాపు 70శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో RRR సినిమా షూటింగ్ పూర్తైయిన వెంటనే పెద్దగా గ్యాప్ లేకుండానే త్రివిక్రమ్ సినిమాకుకు షిఫ్ట్ కానున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలిస్తోంది చిత్రబృందం. టైటిల్‌ను బట్టి ఇది పూర్తి రాజకీయ నేపథ్యమున్న సినిమా అనే విషయం అర్థమవుతోంది. అంతేకాదు ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమకాలీన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు త్రివిక్రమ్ యాక్షన్, ఫ్యామిలీ, ఫాక్ష్యన్ చిత్రాలను తనదైన శైలిలో తెరకెక్కించాడు. ఇప్పుడు ఎన్టీఆర్‌తో చేయబోతున్న ‘అయినను పోయి రావలె హస్తినకు’ సినిమాను పూర్తిగా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కించనున్నాడు. అందులో భాగంగా ఎన్టీఆర్ ఈ సినిమాలో రాజకీయ నాయకుడి వారసుడిలా నటించబోతున్నాడట. పర్ఫెక్ట్ ఫ్యామిలీ పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రానుందని టాక్. సమ్మర్ 2021లో సినిమా విడుదల కానుంది.
అది అలా ఉంటే ఈ సినిమా మరో ఇంట్రెస్టింగ్ వార్త ఏమంటే... ఎన్టీఆర్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారట. అందులో భాగంగా ఓ హీరోయిన్‌గా మరోసారి త్రివిక్రమ్‌కు బాగా కలిసొచ్చిన పూజాహెగ్డేనే ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని టాక్. ప్రస్తుతం ఈ అమ్మడు హిందీతో పాటు, ఇతర తెలుగు సినిమాల్లో బిజీగా ఉండడంతో ఈ సినిమాలో చేసే అవకాశాన్ని వదులుకొనుందని సమాచారం. దీంతో ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా రష్మిక మందనను ఎంపిక చేశారని ప్రచారం సాగగా.. తాజా సమాచారం ప్రకారం రష్మిక స్థానంలో సమంత అక్కినేనిని హీరోయిన్‌గా చిత్ర యూనిట్ తీసుకోనున్నారని తెలుస్తోంది. సమంత గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అత్తారింటికి దారేది', 'సన్ అఫ్ సత్యమూర్తి', 'అఆ' వంటి చిత్రాల్లో నటించింది. ఈ వార్తపై ఎటువంటి అఫీషియల్ న్యూస్ బయటికి రాలేదు. అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఒక హీరోయిన్‌ను బాలీవుడ్ నుండి తీసుకోవాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ఆలియా భట్‌ని గాని, లేదా జాన్వీ కపూర్ ను గాని తీసుకుబోతున్నట్లు తెలుస్తోంది. ఆలియా ప్రస్తుతం రాజమౌళి ఆర్ ఆర్ ఆర్‌లో చరణ్ సరసన నటిస్తోన్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa