తెలుగమ్మాయి అయినా కూడా తమిళ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకున్న అమ్మడు ఐశ్వర్య రాజేష్. తెలుగు వారికి ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్న ఈమె ఇటీవలే విజయ్ దేవరకొండతో కలిసి ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా కూడా సువర్ణ పాత్రతో ఐశ్వర్య ఆకట్టుకుంది. ఆ సినిమా ఫలితాన్ని పట్టించుకోకుండా ప్రస్తుతం ఒక తమిళ సినిమాలో ఐశ్వర్య నటిస్తోంది.
కబాలీ ఫేం రంజిత్ పా నిర్మాణం లో సతీష్ దర్శకత్వం లో రూపొందుతున్న ఒక చిత్రం షూటింగ్ నిమిత్తం ఔట్ డోర్ కు ఈ అమ్మడు వెళ్లింది. అక్కడ దోశ బండి కనిపించడంతో ఆగి మరీ దోశ వేస్తున్న తీరును గమనించి దోశ వేసేందుకు ప్రయత్నించింది. కళ్లకు నల్లటి కళ్లద్దాలు పెట్టుకుని పాయింట్ టీ షర్ట్ వేసుకుని పై నుండి జాకెట్ వేసుకుని అల్ట్రా మ్రోడన్ గా ఉన్న ఐశ్వర్య రాజేష్ దోశ వేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
చాలా సింపుల్ గా దోశను వేయడంతో పాటు దానిపై ఎగ్ ను కూడా కొట్టి పోసింది. ఆ తర్వాత దోశ ను తిప్పి వేసింది. బాగానే దోశను చేసిన ఐశ్వర్య ఆ దోశను ఎవరికి పెట్టింది అనేది మాత్రం చూపించలేదు. తానే తిన్నదా లేదంటో మరెవ్వరికైనా పెట్టిందో వీడియోలో కంటిన్యూ చేయలేదు. మొత్తానికి ఈజీగా దోశ ను వేసిన ఐశ్యర్య రాజేష్ ను చూసి అంతా అవాక్కవుతున్నారు. నటించేసినంత ఈజీగా దోశను వేశావుగా అంటూ మీమ్స్ చేస్తున్నారు.
Actress Aishwarya Rajesh Making Egg Dosa In Sets | Manastars https://t.co/MOWSFTTMGS via @YouTube
— Suryaa Telugu News (@SuryaTeluguNews) March 7, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa