ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ దేవరకొండ సినిమాలో బాక్సర్ మైక్ టైసన్

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 08, 2020, 12:42 PM

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో నిరాశ పరిచిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ’ఫైటర్‘ చిత్రంతో హిట్టు కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. అంతేకాదు ఈ సినిమాతో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టబోతున్నాడు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ‘ఫైటర్’ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. పూరి, చార్మితో కలిసి ప్రముఖ నిర్మాత కరణ్ జొహార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ యువ నటి అనన్య పాండే నటిస్తోంది.


బాక్సింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో విజయ్ బాక్సర్‌‌గా కనిపించబోతున్నాడని సమాచారం. అలాగే, అమెరికా దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషింబోతున్నాడట. విలన్ పాత్రలో టైసన్ నటిస్తాడని, అతనితో విజయ్ ఫైటింగ్ చేస్తాడని సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అయితే, ఈ విషయంపై చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa