రాజకీయాల్లో అడుగుపెట్టి కొంతకాలం సినిమాలకు దూరమైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’తో వెండితెరపై రీఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో హిట్ అయిన ‘పింక్’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో పవన్ న్యాయవాదిగా నటిస్తున్నారు. సినిమాలో పవన్ ఫస్ట్ లుక్, ‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా’ అనే పాట ప్రోమో ఇటీవల రిలీజ్ చేయగా.. భారీ స్పందన వచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పాట పూర్తి లిరికల్ వీడియోను ఈ రోజు రిలీజ్ చేసింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను యువ సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించారు. దానికి సంగీత దర్శకుడు థమన్ మంచి స్వరాలు అందించారు.
మహిళల గొప్పతనాన్ని రామజోగయ్య శాస్త్రి తనదైన శైలిలో వర్ణించగా.. లిరికల్ వీడియలో బ్యాక్ డ్రాప్‌లో నిత్య జీవితంలో మహిళలు నిర్వర్తించే వివిధ పాత్రలతో పాటు వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన మహిళల ఫొటోలను చూపించడం ఆకట్టుకుంది. మహిళా దినోత్సవం రోజు మగువులను గౌరవించుకునేలా రూపొందించిన ఈ పాటకు విపరీతమైన స్పందన వస్తోంది. రిలీజైన నిమిషాల వ్యవధిలోనే లక్షల మంది వీక్షించారు. కాగా, మే 15వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది.
#VakeelSaab - Maguva Maguva Lyrical | Pawan Kalyan | Sid Sriram | Thaman S https://t.co/DJn2bRl03e via @YouTube
— Suryaa Telugu News (@SuryaTeluguNews) March 8, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa