ప్రతి ఉగాదికి ఏదో ఒక కొత్త ప్రోగ్రాంతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఈటీవి ఈసారి కూడా మరోకొత్త ప్రోగ్రాంతో బుల్లితెర ప్రేక్షకులను అలరించనుంది. ఉగాది సంధర్భంగా ఈ సారి 'పండగ సర్.. పండగ అంతే' అంటూ ఓ ప్రోగ్రాం చెయ్యడం దానికి సంబందించిన ఓ ప్రోమోని వదలడం అది కాస్త యూట్యూబ్ లో ట్రెండ్ అవడం జరిగింది. ఎప్పటిలాగే రోజా, శేఖర్ మాస్టర్ లు జెడ్జెస్ కమ్ డాన్సర్స్ గా ఈ షోలో అదరగొట్టగా... శ్రీముఖి, సుడిగాలి సుధీర్ యాంకరింగ్ తో ఇరగ దీశారు. ఇక జబర్దస్త్ యాంకర్ అనసూయ మాత్రం ఈ ప్రోగ్రాంలో మిస్ అయ్యింది. అనసూయ ఈ ప్రోగ్రాం ప్రోమోలో ఎక్కడా కనబడలేదు అంటే.. అనసూయ లేనట్టే. ఆ లోటు తప్ప.. వర్షిణి, ఆది డాన్స్ పెరఫార్మన్స్, రోజా - శేఖర్ మాస్టర్ డాన్స్ పెరఫార్మెన్స్, ఎప్పటిలాగే కామెడీ స్కిట్స్ తో 'పండగ సర్.. పండగ అంతే' అనే స్పెషల్ ప్రోగ్రాం ని డిజైన్ చేసారు. రోజా, శేఖర్ మాస్టర్ అదిరిపోయే క్లాస్ మాస్ డాన్సులు ఈ షో కి స్పెషల్ అట్రాక్షన్స్ గా నిలుస్తాయనేలా వున్నాయి. అలాగే నెవ్వర్ బిఫోర్.. ఎవ్వరూ ఆఫ్టర్ అంటూ రోజా, శ్రీముఖి, శేఖర్ మాస్టర్ చెప్పిన 'సరిలేరు నీకెవ్వరూ' డైలాగ్ మాత్రం అదుర్స్ అన్న రేంజ్ లో పండింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa