ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"లవ్ స్టోరీ" నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్...

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 10, 2020, 03:12 PM

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' రూపొందుతోంది. నాగచైతన్య - సాయిపల్లవి జంటగా ఈ సినిమా నిర్మితమవుతోంది. రేపు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ఈ సినిమా నుంచి 'ఏ పిల్లా ..' అనే లిరికల్ వీడియో సాంగును విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియపరుస్తూ, అధికారికంగా ఒక పోస్టర్ ను వదిలారు.


'ఫిదా' తరువాత శేఖర్ కమ్ముల - సాయిపల్లవి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. ఇక 'మజిలీ' సక్సెస్ తరువాత చైతూ చేస్తున్న సినిమా ఇది. ఈ రెండు కారణాలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. శేఖర్ కమ్ముల గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా, అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేదిగా సాగుతుందని అంటున్నారు. ఈ సినిమాతో ఈ ముగ్గురికి హిట్ దొరుకుతుందేమో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa