ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నితిన్ "రంగ్ దే" నుండి లేటెస్ట్ అప్డేట్...

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 10, 2020, 07:36 PM

నితిన్ నుంచి ఇటీవల వచ్చిన 'భీష్మ' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నితిన్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించింది. దాంతో ఆ తరువాత సినిమా 'రంగ్ దే' షూటింగులో నితిన్ ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. ఇది కూడా పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రమే కావడం విశేషం.


నితిన్ కథానాయకుడిగా దర్శకుడు వెంకీ అట్లూరి 'రంగ్ దే' సినిమాను రూపొందిస్తున్నాడు. సితార బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో, కథానాయికగా కీర్తి సురేశ్ నటిస్తోంది. జూన్ నాటికి ఈ సినిమా షూటింగును పూర్తి చేసి, జూలై చివరిలోగానీ, ఆగస్టు మొదటివారంలో గాని విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa