ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగార్జున 'బంగార్రాజు'లో సమంత?

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 11, 2020, 05:04 PM

కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున హీరోగా 'బంగార్రాజు' మూవీ రాబోతున్నట్లుగా చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ ఈ మూవీ సెట్స్ మీదకు మాత్రం రాలేదు. నాగార్జున సూపర్ హిట్ మూవీ 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాకు సీక్వల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని విన్నాం. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు ఆయన కొడుకు నాగచైతన్య కూడా భాగం కానున్నాడని వార్తలు రాగా.. లేటెస్ట్ సమాచారం మేరకు సమంత కూడా ఈ మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది. అక్కినేని ఫ్యాన్స్‌ సంబరపడేలా ఈ అప్‌డేట్ సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ పీఆర్ఓ చేప్పాడు. బంగార్రాజు చిత్రానికి సంబంధించి ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో స్క్రిప్ట్‌ ఫైనలైజేషన్ పనులు జరుగుతున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు. ఇక ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటించబోతుండగా, నాగచైతన్యకు జోడీగా సమంత నటించబోతోందని టాక్ బయటకొచ్చింది. మామ నాగార్జున, భర్త నాగ చైతన్యలతో కలిసి 'బంగార్రాజు' చిత్రంలో సమంత కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అక్కినేని అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ ముగ్గురినీ సింగల్ ఫ్రేమ్‌లో చూడాలని కుతూహలపడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం నాగార్జున 'వైల్డ్‌ డాగ్‌' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకున్న కారణంగా కళ్యాణ్‌ కృష్ణను ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేసుకోమని చెప్పారట. ఆ మూవీ పూర్తికాగానే 'బంగార్రాజు' సెట్స్ పైకి వచ్చేస్తారట నాగ్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa